మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలి


Fri,August 16, 2019 11:43 PM

నిర్మల్‌టౌన్: అన్ని జిల్లాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేసి అక్టోబర్ 2న స్వచ్ఛసర్వేక్షన్‌లో బహుమతులు పొందేలా జిల్లా యంత్రాంగం చూడాలని స్వచ్ఛసర్వేక్షన్ డైరెక్టర్ దిలీప్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఓడీఎఫ్‌పై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా అధికారులు దేవేందర్‌రెడ్డి, జగదీశ్వర్ డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మిగితావి కూడా పూర్తి చేసి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు జిల్లాకు రానున్నాయని వివరించారు. వీసీలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...