మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..


Fri,August 16, 2019 01:46 AM

ఇచ్చోడ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. జలశక్తి అభియాన్ ఢిల్లీ బృందం అధికారులతో కలిసి కలెక్టర్ గురువారం మండలంలోని కోకస్‌మన్నూర్ గ్రామ సమీపంలో మొక్కలను నాటారు. నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్, జలశక్తి ఆభియాన్ ఢిల్లీ బృందం అధికారులు మాట్లాడారు. నేడు నాటిన మొక్కలు భావి తరాలకు ఉపయోగపడుతాయన్నారు. మానవులు చెట్లను నరకడం మానేయాలని, మొక్కలు నాటి వాటిని పెంచితే రాబోయే రోజుల్లో కరువు కాటకాలు ఉండవని అన్నారు. ఆకాశంలో మేఘాలు నిలువలన్నా, సంవృద్ధిగా వర్షాలు కురువాలన్నా చెట్లే కీలకమని తెలిపారు.

మానవ మనుగడకు మూలాధారం పచ్చని చెట్టని వారు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జలశక్తి ఆభియాన్, తెలంగాణకు హరితహారం పథకాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటి చుక్కను వృథా చేయరాదని, ఇంటింటా ఇంకుడు గుంతలు, పంటపొలాల్లో ఉపాధి హామి ద్వారా కందకాలు నిర్మించుకోవాలని చెప్పారు. కార్యాక్రమంలో జలశక్తి అభియాన్ ఢిల్లీ బృందం నోడల్ అధికారి సంజీవ్‌జాజ్, ఢిల్లీ బృందం సభ్యులు, స్థానిక తహసీల్దార్ లోకేశ్వర్ రావు,ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీపీ నిమ్మల ప్రీతాంరెడ్డి, సర్పంచ్ భగత్ గంగారాం, ఉపసర్పంచ్ శీరీశ్‌రెడ్డి, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...