మరుగుదొడ్లను నాణ్యతతో నిర్మించాలి


Thu,August 15, 2019 01:03 AM

సిరికొండ: మరుగుదొడ్లను నాణ్యతతో నిర్మించాలని మండలం ప్రత్యేక ఆధికారి గాండ్ల రాజేశ్వర్ కాంట్రాక్టర్లకు సూచించారు. మండలంలోని లచ్చింపూర్(బీ), సోంపల్లి గ్రామాల్లో బుధ వారం ఎంపీడీవో ప్రభాకర్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించుకునేలా గ్రామపంచాయతీలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి రూ.12వేలతో ప్రోత్సాహకం అందిస్తుందని, నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. అనంతరం గ్రామాల్లో హరితహారం మొక్కలను నాటారు. కార్యక్రమంలో సోంపల్లి సర్పంచ్ శకుంతల, కార్యదర్శి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...