విద్యార్థులకు అభినందన


Thu,August 15, 2019 01:01 AM

కుంటాల: మండలంలోని పెంచికల్‌పాడ్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు మిషన్ ఇథికల్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నెట్ కథల పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని హెచ్‌ఎం ఎల్లన్న తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీల్లో పాఠశాలకు చెందిన అభిజ్ఞరెడ్డి, లక్ష్మణ్, శ్రీరాం మొదటి, రెండో, మూడో బహుమతులను కైవసం చేసుకున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసాదాల ద్వారా పోటీలను నిర్వహించారని అన్నారు. భారతదేశ నైతిక విలువలపై ఉపన్యాస పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని హెచ్‌ఎం తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...