లైంగికదాడి, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు


Wed,August 14, 2019 12:55 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ/ గుడిహత్నూర్ రూరల్ : మహిళపై లైంగికదాడి చేసి ఆపై హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధిస్తూ జిల్లా మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు గుడిహత్నూర్ ఎస్సై బి.వెంకన్న వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాదేండ్ జిల్లా కిన్వట్ తాలూకా పరిధిలోని సింగర్‌వాడిగూడ గ్రామానికి చెందిన కుర్సింగ ధర్మ, చిన్నమన్నూర్‌కు చెందిన కుర్సింగ వెంకట్ అన్నదమ్ములు గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామంలో పాలేర్లుగా పనిచేసేవారు. మన్నూర్ గ్రామానికి చెందిన కేంద్రె రంజన (42) 2013 అక్టోబర్ 6న వంట చెరుకు కోసం గ్రామ శివారుకు వెళ్లింది. ధర్మ, వెంకట్ ఆమెను గమనించి అనుసరించారు. చుట్టూ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆమెపై దాడి చేసి నోటిని కట్టేశారు. పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. వారిని గుర్తుపట్టకుండా ఉండేందుకు వారి వేళ్లతో రంజన రెండు కనుగుడ్లను పెకిలించేశారు. రక్తంతో విలవిలలాడుతూ అక్కడే పడి ఉంది. అంతలోనే ధర్మ, వెంకట్‌ల మామ తొడసం ముకుందరావు అక్కడికి వచ్చాడు. ముకుందరావు సైతం రంజనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె బతికి ఉంటే గ్రామస్తులకు తెలిసిపోతుందని, చంపేయాలని సలహా ఇచ్చాడు. అందుకు నిందితులు చెట్టుకు ఉరివేసి చంపేశారు. శవాన్ని గ్రామానికి దగ్గరలో ఉన్న స్కూల్ వద్ద పడేశారు. అప్పటి గుడిహత్నూర్ ఎస్సై ఎల్‌వీ రమణ, సీఐలు రాంగోపాల్, ఉదయ్‌కుమార్, రవీందర్ ముగ్గురిపై చార్జిషీట్ దాఖలు చేయగా అదనపు పీపీ ముస్కు రమణారెడ్డి 14 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం ఇద్దరిపై రుజువు కాగా మొదటి కోర్టు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాస్‌రావు నిందితులకు రూ.500 జరిమానా, జీవితఖైదు విధించారు. నిందితుడు వెంకట్ మామ తొడసం ముకుందరావుపై నేరం రుజువు కానందున కేసు కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు. మహిళపై అతికిరాతంగా లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితులకు జీవితఖైదు శిక్షపడడంతో ఆమె బంధువులు, గ్రామస్తులు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...