కేంద్ర నిధులతో లింక్‌రోడ్ల అభివృద్ధి


Sun,July 21, 2019 12:09 AM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ: జిల్లాలో జాతీయ రహదారికి ఏడు లింక్ రోడ్డులు ఉన్నాయని వాటిని కేంద్ర నిదులతో త్వరలోనే అభివృద్ధి చేస్తామని ఎం పీ సోయం బాపు రావు అన్నారు. ఇందు కు గాను సోమవారం మంత్రి నితిన్ గడ్కరీని కలువనున్నట్లు పేర్కొన్నారు. శనివారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అమలుకు నోచుకోని ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్‌లో ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్రం వాటా విడుదల చేస్తే సమస్య తీరుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భైంసా లో వార్డుల విభజన సక్రమంగా జరుగలేదని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఎందరో మందికి ఉన్న త విద్యను అందించే పీజీ కళాశాల తరలిపోకుండా చర్య లు తీసుకొంటామని ఆయన పేర్కొన్నారు.సమావేశం లో అయ్యన్నగారి భూమయ్య, ఓడిసెల శ్రీనివాస్, రాజేందర్, కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...