పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి


Sun,July 21, 2019 12:09 AM

నార్నూర్: పట్టుదల ఉంటే విద్యార్థులు లక్ష్యాలను సాధించవచ్చని అధ్యాపకులు అన్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ-భారతప్రభుత్వం(ఎంహెచ్‌ఆర్‌డి)అందించే ఉపకారవేతనానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ప్రిన్సిపాల్ మ హేందర్‌కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..వార్షిక పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి(ఎంహెచ్‌ఆర్‌డి)స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన కాంబ్లే గోవింద్, కె. నాగేశ్వరి, టి. రాజేశ్వరి ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.2వేలు ఉపకారవేతనం అందిస్తోందన్నారు. వారి వెంట అద్యాపకులు కాంబ్లే బాలాజీ, వెంకట్మ్రణ, ఉదయ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నరేశ్, శ్రీనివాస్, నాగేశ్వర్, అన్నరాజ్, సుజాత, శారద తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...