అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు


Sat,July 20, 2019 03:25 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: వృత్తిలో నిబద్దత, అంకిత భావంతో సేవలందించిన వారికి గుర్తింపు ఉంటుందని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి ఐ లవ్ మై జాబ్ (నావృత్తిని నేను గౌరవిస్తున్నాను) అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో గెలుపొందిన వారికి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, సన్మాన గ్రహితలు తదితరులు పాల్గొన్నారు.

డైట్ కళాశాలలో ఉపాధ్యాయులకు సన్మానం..
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఐ లవ్ మై జాబ్ అనే అంశంపై ఉపాధ్యాయులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని డీఈవో రవీందర్‌రెడ్డి డైట్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని అన్నారు. ఐలవ్ మై జాబ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉపాధ్యాయులందరూ తమ అనుభవానికి సృజనాత్మకతను జోడిస్తూ వ్యాసాలు రాశారన్నారు. సెక్టోరల్ అధికారి కంటె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...