బయోమెట్రిక్ చేయాలి


Sat,July 20, 2019 03:24 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజూ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని ప్రాజెక్ట్ అధికారి కృష్ణఆదిత్య అన్నారు. శుక్రవారం కుమ్రంభీం ప్రాంగణంలోని మీటింగ్ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల వార్డెన్, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ విద్యార్థుల వివరాలు బయోమెట్రిక్ ద్వారా పొందుపర్చాలన్నారు. ఉపాధ్యాయులు, సీఆర్టీలు, ఏఎన్‌ఎంలు స్థానికంగానే నివాసం ఉండాలన్నారు. ఉపాధ్యాయులు లెస్సన్ ప్లాన్, టీచింగ్ డైరీని రాయాలని సూచించారు. బడీడు పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలన్నారు. సమాచారం కోసం వార్డెన్‌లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే సెల్‌ఫోన్‌లు వాడాలని సూచించారు. కొత్తగా మూడు క్రీడా పాఠశాలలు ప్రారంభమైనందున విద్యతోపాటు క్రీడల్లో విద్యార్థుల నైపుణ్యం పెంచాలన్నారు. కార్యక్రమంలో డీడీ చందన సర్పె, కుమ్రంభీం జిల్లా డీటీడీవో దిలీప్, మంచిర్యాల డీటీడీవో సంజీవ్‌రావు, నిర్మల్ డీటీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఉట్నూర్ ఏటీడీవో చంద్రమోహన్, ఆదిలాబాద్ చిరంజీవి, బోథ్ సౌజన్య, జైనూర్ ఆత్రం భాస్కర్, ఆసిఫాబాద్ శ్రీనివాస్, కాగజ్‌నగర్ నీలిమా, మంచిర్యాల నారాయణ్‌రావు, ఉట్నూర్ ఏసీఎంవో జగన్, మంచిర్యాల ఏసీఎంవో రాజమౌళి, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...