ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం


Wed,July 17, 2019 03:44 AM

ఆదిలాబాద్ టౌన్ : ఆరోగ్య తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు రూ.10,49,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ మెరుగైన వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు. బడ్జెట్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సదుపాయాలు కల్పించిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల పనితీరు మెరుగుపడిందన్నారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఏజెన్సీలో మాతా, శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12000 ప్రోత్సాహకంతో పాటు తల్లీబిడ్డల సంరక్షణకు అవసరమైన కిట్ అందజేస్తున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీ నిర్మాణం పూర్తయితే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనీష, మాజీ కౌన్సిలర్ బండారి సతీశ్, నాయకులు ప్రహ్లాద్, ఖయ్యుం, రాథోడ్ రామారావు, విజయ్‌కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...