డిగ్రీ సీట్ల భర్తీకి 17న కౌన్సెలింగ్


Wed,July 17, 2019 03:43 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీకి ఈనెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ హేమాజీ డోంగ్రే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరానికి బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ ప్రవేశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్ విద్యార్థులు సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ కౌన్సెలింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థినులు ఇంటర్ టీసీ, మెమో, ఎస్సెస్సీ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ జిరాక్స్‌లతో హాజరుకావాలన్నారు. బీఎస్‌సీ, ఎంపీసీఎస్‌లో 12 సీట్లు, బీజడ్సీలో 15 సీట్లు, బీకాం కంప్యూటర్స్‌లో 28 సీట్లు ఉన్నాయని వివరించారు. ఇతర వివరాలకు డిగ్రీ కళాశాలలో సంపద్రించాలని సూచించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...