గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలి


Tue,July 16, 2019 04:27 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: పోలీసులు గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ముందుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌లలో రోజు వారీగా వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత న్యాయమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకవచ్చిందన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు నేరుగా పోలీసులకు అందజేస్తున్నారని తెలిపారు. సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక రుగ్మతలను తొలగించేందుకు పోలీసు కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీసీ దుర్గం శ్రీనివాస్, ఫిర్యాదుల విభాగం అధికారిణి జైస్వాల్ కవిత, పలు విభాగాల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...