విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి


Tue,July 16, 2019 04:26 AM

ఎదులాపురం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో కేజీబీవీలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే బాలికలకు ప్రతిరోజూ ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిరక్షణ మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడుకుంటూ చదువులో ముందుకు సాగేలా అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై విద్యార్థులను అప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ఏఎన్‌ఎంలే తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి కంది శ్రీనివాస్‌రెడ్డి, కంటి నర్సయ్య, పీహెచ్‌సీ వైద్యురాళ్లు నవ్య, కావ్య, వైద్య సిబ్బంది సరోజ, శ్యామల, విజయలక్ష్మి, రిసోర్స్‌పర్సన్లు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...