బోనాల జాతర


Mon,July 15, 2019 02:35 AM

-సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీక బోనాలు
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసన్న దుర్గామందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిసంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. ప్రత్యేక తెలంగాణలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.
నందిగుండం ఆలయాభివృద్ధిలో గతంలో నిధులు మంజూరు చేశామని, రూ.50 లక్షల వ్య యంతో నిర్మించిన ఆలయాన్ని బోనాల జాతర సం దర్భంగా ప్రారంభించామని అన్నారు. నూతన ఆల యం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి సైతం నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు బుధవార్‌పేట్‌ పోచమ్మ ఆలయం నుంచి మహిళలు భారీ ప్రదర్శనగా బోనాలతో బయలుదేరారు. ఆలయానికి చేరుకొన్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏ ర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్‌ రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి, ముత్యం సంతోష్‌గుప్తా, అల్లోల మురళీధర్‌రెడ్డి, దేవరకోట ఆలయ కమిటీ చైర్మన్‌ ఆమెడ కిషన్‌, రావుల రాంనాథ్‌, డి.శ్రీనివాస్‌, భూషణ్‌రెడ్డి, ప్రభుదాస్‌, టోస్రె శంక ర్‌, రమేశ్‌, కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...