సమస్యల పరిష్కారానికి సదస్సులు


Mon,July 15, 2019 02:33 AM

ఇంద్రవెల్లి: ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కెస్లాపూర్‌ నాగోబా దర్బార్‌ అవరణలో న్యాయసేవా సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని కెస్లాపూర్‌ గ్రామంలోని నాగోబా దర్బార్‌హల్‌లో ఏర్పాటు చేసిన రాయిసెంటర్‌ సమావేశంలో పాల్గొని ఆదివాసీ గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ 27న కెస్లాపూర్‌లో న్యాయసేవా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తితోపాటు హైకోర్టు న్యాయమూర్తి వస్తున్నారన్నారు. ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులు ఎదురుకుంటున్న సమస్యలపై క్లుప్తంగా దరఖాస్తులు రాసి న్యాయసేవా సదస్సుకు వచ్చిన న్యాయమూర్తిలకు అందించాలని సూచించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూసమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల పరంగా, విద్య, వైద్యరంగంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సమా వేశానికి ముందు ఆదివాసీ గిరిజన సంఘల నాయకులు మాట్లాడారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులకు రాజ్యాంగపరంగా కలిపించిన పూర్తి హక్కులు ఆదివాసీలకు కలిపించాలన్నారు. ఏజెన్సీలో ఎస్టీలుగా చలమణి అవుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే విషయంపై చర్చించాలన్నారు. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న ఆదివాసీలకు అటవిహక్కు పత్రాలు జారీచేయాలన్నారు. ఏజెన్సీలో లంబాడాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో ఏజెన్సీలోని నిజమైన ఆదివాసీ గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మహారాష్ర్టా నుంచి వలసవచ్చిన బేల్‌దార్‌ కులస్తులు 22మంది ఎస్టీ ధ్రువీకరణ పత్రా లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉట్నూర్‌ కోర్డు న్యాయమూర్తి బీవీ కిరణ్‌కుమార్‌, న్యాయవాదులు వాగ్మారే రాహుల్‌, నాగేశ్వర్‌రావ్‌, ఆదివాసీ గిరిజన నాయకులు మెస్రం వెంకట్‌రావ్‌, సిడాం భీమ్‌రావ్‌, మెస్రం దుర్గు, ఆర్కా ఖమ్ము, కోడప నగేశ్‌, బాపురావ్‌, మెస్రం నాగ్‌నాథ్‌, ముకాడే విష్ణు, సీడబ్ల్యుసీ కమిటీ చైర్మన్‌ మిర్జాయాకుబ్‌బేగ్‌ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...