హరితహారంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం


Mon,July 15, 2019 02:32 AM

సోన్‌: తెలంగాణ హరితహారంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ మండలంలోని ఎల్లపెల్లి, కొండాపూర్‌ గ్రామంలో ఐదో విడత హరితహారంలో భాగంగా ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు. పర్యావరణ పరిపరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టిందన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతలుగా హరితహారం నిర్వహించగా.. 230 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపారు. ఈఏడాది మరో వంద కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ సంవత్సరం 2కోట్ల 10లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హరితహారంలో అధికారులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అడవుల 23శాతం పడిపోవడంతో పర్యావరణ సమస్య ఏర్పడి వర్షాలు కురవకుండా పోతున్నాయని, దీనివల్ల కాలుష్యమైన వాతావరణం కూడా ఏర్పడుతుందన్నారు. ప్రజలు బాగుండాలంటే చెట్లు పెంచడమే కర్తవ్యంగా గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాల్లో మొక్కలను నాటి బాగా పెంచిన వారికి హరితమిత్ర ద్వారా ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తరపున అభివృద్ధి నిధుల కేటాయింపులో ఆయా గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఛైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, సోన్‌ జడ్పీటీసీ సభ్యుడు జీవన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ముత్యంరెడ్డి, ఎల్లపెల్లి, కొండాపూర్‌ గ్రామ సర్పంచులు అల్లోల రవీందర్‌రెడ్డి, నవాత్‌ గంగాధర్‌, ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌రెడ్డి, మాజీ సర్పం చుల సంఘం అధ్యక్షులు చెనిగారపు నరేశ్‌, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు భూషణ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...