రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,July 12, 2019 02:08 AM

ఎదులాపురం : తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు రాయితీ రుణాలను పంపిణీ చేస్తుందని అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ హన్మాండ్లు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 9 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను కమిటీ సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ మాట్లాడుతూ రుణాల కోసం ఎంపిక చేసుకున్న అంశాలతో పాటు వారి నైపుణ్యం, అనుభవాన్ని అంచనా వేసి అర్హులను ఎంపిక చేశారు. బుధవారం 9 మండలాల్లో 65 యూనిట్ల టార్గెట్ ఉండగా.. 485 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇందులో 174 హాజరు కాగా.. 311 మంది గైర్హాజరయ్యారన్నారు. గురువారం నిర్వహించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో మిగిలిన 9 మండలాల్లో 54 టార్గెట్ ఉండగా.. 335 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 146 మంది హాజరు కాగా.. 189 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 119 టార్గెట్ ఉండగా.. 820 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జీఎం డీఐసీ రాంకిషన్, ఎల్‌డీఎం చంద్రశేఖర్, ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డీటీ సూరజ్ రాథోడ్, నర్సయ్య, ఉద్ధవ్, విలాస్, ప్రశాంత్, కృష్ణ, మంజుల, గంగన్న తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...