విభజన అస్తవ్యస్తం!


Thu,July 11, 2019 01:24 AM

భైంసా, నమస్తే తెలంగాణ : భైంసా మున్సిపాల్టీలో వార్డుల పునర్విభజన తీరుపై ప్రజలు, కుల సంఘాలు, పలు పార్టీల నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 2న విడుదలైన ముసాయిదా జాబితా సరిగా లేదని ప్పటికే చాలా మంది అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే జాబితా గజిబిజిగా తయారు చేశారని, ఇష్టరీతిన వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టారని, వెంటనే సవరించాలని రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఒకే కాలనీకి చెందిన ఓటర్లు రెండు, మూడు వార్డులలో ఓట్లు కలిగి ఉన్నారని అధికారులకు వినతి పత్రాలు అందించారు.

మొత్తం 26 వార్డులు
భైంసా మున్సిపాల్టీలో గతంలో 23 వార్డులు ఉండగా.. ప్రస్తుతం మరో మూడు వార్డులు పెరిగి 26కు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 49,764 మంది జనాభా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం 41,292 మంది ఓటర్లు ఉన్నారు. 41,292 మంది ఓటర్లను 26 వార్డులకు విభజిస్తే.. కనీసం 1588 మంది ఓటర్లు ఉండాలని, కనిష్టంగా లేదా గరిష్ఠగా కలిపి 1427, 1744 ఒక్కో వార్డులో చేపట్టారు.

కలెక్టర్‌కు స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు
జీవో నం. 31 ప్రకారం కాకుండా కేవలం ఒక వర్గానికి, ఒక పార్టీకి అనుకూలంగా చేశారంటూ స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హిందూవాహిని నాయకుడు కపిల్, లింగోజి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. బీజేపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టి అనంతరం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్టణంలో సుమారు 30 వరకు అభ్యంతరాలపై వినతి పత్రాలు అందించారు.

కులాల వారీగా ఫిర్యాదులు
వార్డుల విభజన ప్రక్రియలో ఒక వర్గానికి అనుకూలంగా చేపట్టారని ఆరోపిస్తూ భట్టిగల్లి మున్నూరుకాపు సంఘం, కిసాన్‌గల్లి మున్నూరుకాపు సంఘం, తదితర నాయకులు అధికారులకు వినతి పత్రాలను అందించారు. ఇంటి నంబర్లు ఆయా వార్డుల్లో లేకుండా ఇతర వార్డుల్లో చేర్చారని, కొందరిని అసలే ఇందులో తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా ఆరో వార్డు నుంచి కొందరిని తీసి ఒకటో వార్డులో వేశారని, పాతవి 23 వార్డులు అలాగే ఉంచి 15వ వార్డులో అత్యధిక జనాభా ఉన్న వాటిని మూడు వార్డులుగా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డుల విభజనపై పునరాలోచించాలని కోరుతూ కలెక్టర్ ప్రశాంతి, జేసీ భాస్కరావుకు, ఆర్డీవో రాజు, కమిషనర్ జయరాజ్‌కు వినతి పత్రాలను సమర్పించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...