నేడే బీసీ గురుకులాలు ప్రారంభం


Mon,June 17, 2019 01:08 AM

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు ఒక్కో గురుకుల పాఠశాల మంజూరయ్యింది. ఆదిలాబాద్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మావలలో ఏర్పాటు చేస్తుండగా, బోథ్ బాలుర గురుకుల పాఠశాలను పట్టణంలోని రాంనగర్‌లో ఏర్పాటు కానున్నది. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయగా, సోమవారం పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు ఈ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.
ప్రభుత్వం వివిధ వర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన చదువులు అందుతున్నాయి. జిల్లాలో ఎస్సీ, మైనార్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాల్లో పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్ విద్య అందుతుండడంతో వీటిల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించడానికి ప్రభుత్వం కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు ఒక్కో గురుకుల పాఠశాల మంజూరైంది. ఆదిలాబాద్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మావలలో ఏర్పాటు చేస్తుండగా బోథ్ బాలుర గురుకుల పాఠశాలను పట్టణంలోని రాంనగర్‌లో ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే రెండు బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాఠశాల జైనథ్‌లో మంజూరు కాగా.. ప్రస్తుతం మావలలో, బోథ్ నియోజకవర్గ పాఠశాల తాంసి మండలం ఈదుల సవర్‌గాంకు మంజూరు కాగా.. ప్రస్తుతం ఆదిలాబాద్ మండలం అనుకుంటలో నిర్వహిస్తున్నారు. రెండేండ్ల కిందట ఈ స్కూళ్లు ప్రారంభంమయ్యాయి. మావలలో బాలుర, అనుకుంటలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా వీటిల్లో ఈ విద్యా సవంత్సరం నుంచి 5 తరగతి నుంచి 9 తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో పాఠశాలల 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2017 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాల్లో మొదటగా 5, 6, 7 తరగతులను ప్రారంభించారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లుగా విభచించి ప్రతి సెక్షన్‌లో 40 విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు రుచికరమైన భోజనంతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ, నాణ్యమైన విద్యా బోధన పొందవచ్చు.

నేడు రెండు గురుకులాలు ప్రారంభం...
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు మంజూరైన కొత్త గురుకుల పాఠశాలలు నేడు ప్రారంభకానున్నాయి. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు కొత్త పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాత బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌లకు కొత్త పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకున్నారు. ఈ పాఠశాల్లో ఇటీవల కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల్లో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యాటరింగ్‌ను టెండర్ విధానంలో కేటాయించగా, సెక్యూరిటీ, స్వీపింగ్, సానిటేషన్, ఇతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పై నియమించారు. ప్రతి పాఠశాలలో 5, 6, 7 తరగతులను ఏర్పాటు చేస్తుండగా ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 40 మంది విద్యార్థుల చొప్పును తరగతికి 80 విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మావలలో ఏర్పాటు చేసే బాలికల పాఠశాలలో 240 విద్యార్థినులు, రాంనగర్ స్కూళ్లో 240 మంది బాలురకు తీసుకుంటారు. కొత్త పాఠశాలల ఏర్పాటుతో జిల్లాలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1280 మంది విద్యార్థినీ విద్యార్థులకు చదువుకునే అవకాశం లభించింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...