ప్రతీ నీటి బొట్టు ఒడిసిపట్టి..!


Mon,June 17, 2019 01:06 AM

-వర్షపు నీటి నిల్వకు చర్యలు
-వాగులకు అడ్డంగా చెక్‌డ్యాముల నిర్మాణం
- ప్రాజెక్టు కాల్వల వద్ద తూముల ఏర్పాటు
-స్థలాలను పరిశీలిస్తున్న అధికారులు
-త్వరలో పనులు ప్రారంభం
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా విడతల వారీగా కోట్ల రూపాయల వ్యయంతో చెరువుల మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి వృథా నీటిని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌డ్యాములు, కాలువల నీళ్లు చెరువులోకి మళ్లే లా తూముల నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు కసరత్తు చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. సర్కారు నుంచి అనుమతులు రాగా.. టెండర్ల ప్రక్రిమ పూర్తి అయింది. 75 డ్యాములు, ఆరు తూముల నిర్మాణానికి అధికారులు సర్వే చేపట్టారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
మిషన్ కాకతీయ పథకంలో ఉమ్మడి జిల్లాలో ని ర్వహించిన సర్వే ప్రకారం 7,380 చెరువులు ఉ న్నాయి. విడతల వారీగా రూ.421.40 కోట్లు వ్య యంతో 1,491 చెరువులకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 1,279 చెరువులు పూర్తి కాగా.. మిగిలిన చెరువుల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. చెరువుల పునరుద్ధరణతో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షం నీటిని ఎక్కడికక్కడ నిలిపివేసేందుకు వాగులకు అడ్డంగా చెక్‌డ్యాముల నిర్మాణంతోపాటు ప్రాజెక్టులకు సం బంధించిన కాలువల ద్వారా చెరువులను నింపేందుకు తూముల నిర్మాణం చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. పూర్వపు జిల్లాలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం తలపెట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇవ్వడంతో ఈసారి చెక్‌డ్యాములు, తూములు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు జిల్లాల వారీగా ప్రతిపాదించిన చెక్‌డ్యాములను, తూముల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో సాంకేతిక అనుమతులు, టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని నీటి పారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 215 చెక్‌డ్యాములు, 17 తూములు మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో అనేక చెరువులను పునరుద్ధరించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి వాటికి అనుబంధంగా తూముల నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ చోట్ల చెక్‌డ్యాముల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో వృథాగా పోతున్న 70 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి జిల్లా పరివాహకంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఇంకించేందుకు వీలుగా వాగులకు అడ్డంగా చెక్‌డ్యాములను, ప్రాజెక్టుల పరివాహక పరిధిలోని చెరువులు నీటితో నింపేందుకు వీలుగా తూముల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఉన్న సాత్నాల, మత్తడి వాగు, పెన్‌గంగా ప్రాజెక్టు పరిధిలో ఉండే చెరువులకు ఆయా ప్రాజెక్టులకు చెందిన కాలువల ద్వారా నింపేందుకు అవసరమైన చోట తుములు నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ మేరకు సాత్నాల పరిధిలో ఒక తూం, మత్తడి వాగు ప్రాజెక్టు పరిధిలో మరో చెరువులోకి నీరు చేరేందుకు తూముల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇప్పటికే ప్రాజెక్టు కింద వడ్డాడి, జందాపూర్, ఈదుల్లా సావర్గాం, చెరువుల్లోకి నీరు చేరుతున్నది.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...