అక్రిడిటేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి


Mon,June 17, 2019 01:03 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 2019-20 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్‌లు మంజూరుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో మంజూరు చేసిన అక్రిడిటేషన్‌ల కాల పరిమితి ఈ నెల 30వ తేదీతో ముగియనున్నదని, జూలై 1 నుంచి కొత్త గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 25లోగా http://ipr.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని భీమ్‌కుమార్ తెలిపారు. సంబంధిత జిల్లాలకు చెందిన మీడియా ప్రతినిధులు వారి యాజమాన్యాల నుంచి జాబితాలను తెప్పించుకొని ఈ నెల 25లోగా డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...