రెండో రోజూ కొనసాగిన ధ్రువపత్రాల పరిశీలన


Sun,June 16, 2019 02:58 AM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నిజ ధ్రువీకరణ పత్రాల పరిశీలన రెండో రోజు కొనసాగింది. జిల్లాకేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం 600ల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన మార్కులతో పాటు మెరిట్‌ ఆన్‌లైన్‌లో ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉండవద్దన్నారు. పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు నిబంధనల మేరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందన్నారు. రోజుకు 500ల నుంచి 600ల మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిన ప్రతి అభ్యర్థి నిజ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కంచ మోహన్‌, పోలీసు కార్యాలయ అధికారులు అశోక్‌కుమార్‌ వశిష్ట్‌, యూనిస్‌, సూర్యకాంత్‌, గంగాధర్‌, సందీప్‌, మురళి, జగదీశ్‌, దయానంద్‌, కొండరాజు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...