వారం రోజుల్లో భూ సంబంధితసమస్యలను పరిష్కరించాలి


Sun,June 16, 2019 02:57 AM

నిర్మల్‌ టౌన్‌: జిల్లావ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ పక్కగా పాస్‌పుస్తకాలు అందించాలని, వారం రోజుల్లో భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం తహసీల్దార్లు, ఏఈవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున నేపథ్యంలో అర్హులైన రైతులందరికీ పథకం వర్తించేలా డిజిటల్‌ పాస్‌ పుస్తకాలను అందించడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలని సూచించారు. పట్టాపాస్‌ పుస్తకాల్లోని తప్పులను తహసీల్దార్లు పరిష్కరించారని, త్వరలోనే పూర్తి స్థాయిలో తప్పులను సవరించి ప్రతి రైతుకూ పాస్‌పుస్తకం అందించాలన్నారు. గ్రామాల వారీగా ఎంత మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు, ఎంత మందికి అందజేయాల్సి ఉంది, జారీ చేయకపోవడానికి కారణాలను వివరిస్తూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు, అధికారులు నదీంఖాన్‌, ఏఈవోలు పాల్గొన్నారు.

సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం
సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నిలిచిన ప్రజాఫిర్యాదుల విభాగాన్ని సోమవారం నుంచి పునఃప్రారంభిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...