జిల్లా ప్రగతిలో భాగస్వామి కావడం అదృష్టం


Sun,June 16, 2019 02:57 AM

ఆదిలాబాద్‌ టౌన్‌ : ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ప్రజలకు సేవ చేయడం తన అదృష్టమని జడ్పీ చైర్‌పర్సన్‌ వల్లకొండ శోభారాణి అన్నారు. ఐదు సంవత్సరాల పదవీ కాలం సంతృప్తినిచ్చిందన్నారు. తనకు సహకరించిన ప్రజాప్రతిధులు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపురావు, రేఖనాయక్‌, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, విఠల్‌, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, కోవ లక్ష్మిలకు ప్రత్యేకంగా కృతజ్ఞలు తెలిపారు. జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదన్నారు. తనకు జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ను, వైస్‌ చైర్మన్‌లను మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ సీఈవో, అధికారులు సన్మానించారు. అలాగే ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రాథోడ్‌ బాపురావు, ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. జ్ఞాపికను అందించి సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...