సైనికులను తయారు చేయడమే ఎన్‌సీసీ లక్ష్యం


Sun,June 16, 2019 02:56 AM

ఎదులాపురం : సైనికులను తయారు చేయడమే ఎన్‌సీసీ లక్ష్యమని లెఫ్ట్‌నెంట్‌ కల్నాల్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా కమాండింగ్‌ అధికారి పంకజ్‌ గుప్తా అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఎన్‌సీసీ 32వ (టి) 2వ టీఏపీపీ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉత్తమ పౌరులను అందించడంతో పాటు దేశానికి సేవ చేసే భాగ్యం ఎన్‌సీసీ క్యాడెట్లకే లభిస్తుందన్నారు. శిక్షణ పొంది సర్టిఫికెట్లు సాధించిన క్యాడెట్లకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సైనిక సిబ్బంది ఎన్‌సీసీ క్యాడెట్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశం కోసం ప్రాణా లర్పించిన ఆర్మీ జవాన్లు, ప్రముఖుల విజయ గాథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి 450 మంది క్యాడెట్లు ఈ శిబిరానికి హాజరయ్యారన్నారు. శిబిరం పది రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణలో ఫైరింగ్‌, డ్రిల్‌, మ్యాప్‌ రీడింగ్‌, యుద్ధ శిక్షణ, ఆరోగ్య, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. సుబేదార్‌లు అర్పాల్‌ సింగ్‌, ఓంప్రకాశ్‌, సైనిక సిబ్బంది, రాజేశ్వర్‌, నరేందర్‌, శ్రీనివాస్‌, ప్రసన్న, పూర్ణచందర్‌ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...