17న ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి


Sat,June 15, 2019 12:23 AM

నిర్మల్‌టౌన్: 2019-20 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17న ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయాల్లో హాజరుకావాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ది అధికారి కిషన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయిస్తూ హైదరాబాద్ నుంచి ఎస్‌ఎంఎస్ వచ్చిన వారు ఉదయం 11గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...