హరితహారంలో మొక్కలు నాటించాలి


Sat,June 15, 2019 12:23 AM

సోన్: వర్షాలు కురిసిన వెంటనే హరితహారంలో భాగంగా మొక్కలు పకడ్బందీగా నాటించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నిర్మల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఏపీవో, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారంలో భాగంగా ముందుగానే గుంతలు తవ్వుకొని ఉండాలని, వర్షాలు బాగా కురిసిన వెంటనే నాటించేలా చూడాలని సూచించారు. అన్ని గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో హరితహారం కింద ఈ సంవత్సరం 2కోట్ల 60లక్షల మొక్కలను నాటేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచినట్లు వివరించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిరాం, ఈవోపీఆర్డీ శ్రీధర్, ఏపీవో తుల రామకృష్ణ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...