క్రీడాకారుడికి సన్మానం


Sat,June 15, 2019 12:23 AM

భైంసారూరల్ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించిన చందులాల్ విఠల్‌ను శుక్రవారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి దేగాంలోని తన నివాసంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్న గ్రామం నుంచి రాష్ట్ర కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించిన విఠల్ కుభీర్ మండలం బాకోట్ గ్రామానికి చెందిన వాడని తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ సాగరబాయి, టీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, లోలం శ్యాంసుందర్, సోలంకి భీంరావు, సర్పంచ్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...