డ్యాంగాపూర్‌లో గొర్రెల దాణా పంపిణీ


Sat,June 15, 2019 12:23 AM

సోన్: నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలో గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం ద్వారా శుక్రవారం 40 మంది లబ్ధిదారులకు దాణాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి రమేశ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రతి లబ్ధిదారుడికి 207 కిలోల దాణా అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు దాణాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోనగిరి సరిత , డాక్టర్ మహేశ్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...