నట్టల నివారణ టీకాల పంపిణీనిసద్వినియోగం చేసుకోవాలి


Sat,June 15, 2019 12:23 AM

నిర్మల్ టౌన్: జిల్లాలో ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి రమేశ్‌కుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. జిల్లాలోని 19 మండలాల్లో ప్రాథమిక పశువైద్యాధికారుల సమక్షంలో అన్ని మండలాల్లో నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. సీజనల్‌గా వచ్చే వ్యాధులను నియంత్రించే లక్ష్యంతో ఈ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...