వీఆర్వో అవినీతి అక్రమాలపై ఆర్డీవో విచారణ


Sat,June 15, 2019 12:22 AM

కుంటాల : మండలంలోని సూర్యాపూర్ వీఆర్వో నవీన్‌సింగ్ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో జేసీ భాస్కర్‌రావు ఆదేశాల మేరకు శుక్రవారం భైంసా ఆర్డీవో రాజు సూర్యాపూర్‌లో విచారణ జరిపారు. తుంగ గంగుబాయి వారసత్వ పట్టా మార్పిడి కోసం గత రెండేండ్లుగా వీఆర్వో నవీన్ సింగ్‌కు విన్నవించినా.. రూ. 30 వేలు లంచం ఇస్తేనే.. పట్టా ఇస్తామని తమకు ఇబ్బందులకు గురి చేశాడని గంగుబాయితో పాటు కుమారులు పోతన్న, సురేశ్ ఆర్డీవోకు వివరించారు. సూర్యాపూర్‌లో పలువురు రైతుల నుంచి డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. మెదన్‌పూర్, అంబుగాం గ్రామంలో శనివారం విచారణ చేపడతామని పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. వీఆర్వో నవీన్‌సింగ్‌కు పట్టాల మార్పిడి కోసం డబ్బులు ఇచ్చిన వారు, ఇబ్బందులకు గురైన వారు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ ఉమాశంకర్, ఆర్‌ఐ సబిత, సూపరింటెండెంట్ పుష్పలత, వీఆర్వో సంతోష్, సిబ్బంది ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...