సమస్యలకు పరిష్కారం చూపాలి


Sat,June 15, 2019 12:22 AM

ఆదిలాబాద్ టౌన్ : స్థానిక సంస్థలకు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ పదవీ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, మావల జడ్పీటీసీ సభ్యురాలు నల్ల వనిత రాజేశ్వర్, ఎంపీపీ చందాల ఈశ్వరి రాజన్న, చింతలమానెపల్లి ఎంపీపీ డుబ్బుల నానయ్యలకు జడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్ పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సన్మానించారు. జడ్పీటీసీలు ఇజ్జగిరి అశోక్, కేశవ్ గిత్తే, చిన్నయ్య, లక్ష్మణ్, సుజాత, టీఆర్‌ఎస్ మావల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, వాఘాపూర్ సర్పంచ్ నారాయణ, ఆరిఫ్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...