ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు


Fri,June 14, 2019 01:05 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పోలీస్ స్టేషన్లలో రోజువారీగా వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్‌లోని పోలీస్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలను పరిరక్షించడానికి రోజువారీగా విధులు నిర్వహించాలని సూచించారు. నిందితులు అరెస్టు కాకుండా దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలన్నారు. సురక్షితమైన జిల్లా గా అభివృద్ధి బాటలో పయనిస్తుండడంతో జిల్లా పోలీసుల బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడం శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసుల కృషి అభినందనీయమని కొనియాడారు. బాధితులు సహాయం కోసం వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా స్పందించాలన్నారు. అవసరమైన సందర్భాల్లో సానుభూతిని ప్రదర్శించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ అధికారి మానవీయ కోణంలో ఆలోచించి పోలీసింగ్ నిర్వహించాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో మహిళల భద్రత అంశాలపై షీ టీం బృందాలు రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో మహిళలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత షీటీం బృందాలపై ఉందని గుర్తు చేశారు. మారుమూల గ్రామాల్లో ప్రజలను చైతన్య వంతులను చేయడమే పోలీసు జాగృతి కళా బృందం లక్ష్యం అని తెలిపా రు. ప్రతి గ్రామంలో సామాజిక సమస్యలతో పాటు మూఢ నమ్మకాలపై, నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కంచ మోహ న్, డీఎస్పీలు ఎల్‌సీ నాయక్, బి.డేవిడ్ ఏసుదాస్, స్పెష ల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ యు.వెంకన్న, పట్టణ సీఐలు వి.సురేశ్, ఏ.ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సీఐ జవాజీ సురేశ్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాజ్‌కుమార్, జైనథ్, ఇచ్చో డ, బోథ్, ఉట్నూర్ సీఐలు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, జైరామ్ నాయక్, కె.వినోద్, ఎస్సైలు చిరంజీవి, దశరథ్, శ్రీనివాస్, పి.సుబ్బారావు, ఎ.గంగారాం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...