పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ


Fri,June 14, 2019 01:04 AM

ఆదిలాబాద్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కే.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐదున్నర నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించరాదని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 20 తేదీ వరకు www.tsscstudycircle. telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 30న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వంద మంది అభ్యర్థులకు జూలై 15 నుంచి డిసెంబర్ 31 వరకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో రూ.2500 విలువ చేసే స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ 9494149416లో సంప్రదిచాలని పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...