నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి


Fri,June 14, 2019 01:04 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : విద్యాహక్కు చట్టాన్ని పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఐటీయీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ అన్నారు. ఈ మేరకు గురువారం డీఆర్వో నటరాజన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మల్లేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఫీజులు తగ్గించడంతో పాటు డోనేషన్లు తీసుకోవద్దని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూసం సచిన్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి కపిల్, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి తొడసం భీంరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి
ఎదులాపు రం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు వినోద్‌కుమార్ కోరారు. ఈ మే రకు గురువారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్‌కు పీడీఎస్‌యూ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను మూసి వేయాలన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బుక్‌స్టాల్ యాజమాన్యాలతో కుమ్మక్కై పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై, బుక్‌స్టాళ్లపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. లేని పక్షంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాష్ట్ర నాయకుడు రెడ్డి చరణ్, జిల్లా నాయకులు రాథోడ్ దేవిలాల్, దుర్గం కళావతి తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...