ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్


Thu,June 13, 2019 03:36 AM

లక్ష్మణచాంద: ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు.బుధవారం మండలంలోని నర్సాపూర్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎటువంటి భయాందోళన లేకుం డా, వారిలో భరోసా కలిగించడాని కే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నమన్నారు. ఈ తనిఖీలో ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని 51 ద్వి చక్రవాహనాలకు, 11 వేల విలువైన మ ద్యా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్, సరైనా ధ్రువపత్రా లు లేకుండా వాహనాలు నడుపరాదన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. సరైనా ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు. హెల్మెట్ ధరించి వా హనం నడుపుతున్న గ్రామస్తులను శా లువాతో సన్మానించారు. ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సీఐలు జాన్‌దివాకర్, రమేశ్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌కుమార్, ఆర్‌ఐ వెంకట్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...