మోగిన బడిగంట


Thu,June 13, 2019 03:36 AM

నిర్మల్‌టౌన్/ఖానాపూర్/కుభీర్/సోన్ :వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 1న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 12న ప్రారంభించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చారు. ఇదివరకే తల్లిదండ్రులు పిల్లల కోసం బ్యాగులు, నోట్‌పుస్తకాలు, టిఫిన్ బాక్సు, యూనిఫాంలు కొనుగోలు చేశారు. వేసవి సెలవుల్లో ఆటా పాటలతో గడిపిన చిన్నారులు ఇక పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ఉదయాన్నే తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల్లో బుధవారం నుంచే పాఠ్యాంశాలు బోధించడం ప్రారంభించారు. మార్కెట్‌లో విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, సడ్టీ మెటీరియళ్ల కొనుగోళ్లతో సందడి నెలకొంది. హాస్టళ్లకు వెళ్లే విద్యార్థులు తమకు అసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. పుస్తక స్టోర్‌లు, చెప్పుల దుకాణాలు, బ్యాగుల దుకాణాలు, జనరల్ స్టోర్‌లు కిటకిటలాడా యి. జిల్లా కేంద్రంలోని బాగులవాడ, గాంధీనగర్, ఆదర్శనగర్ శిశుమందిరాల్లో మొదటి రోజు పాఠశాల ప్రారంభంకావడంతో అక్షరాభ్యాసంతో పాటు యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. ఖానాపూర్, పెంబి మండలా ల్లో సుమారు 70 ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమాలు, గరుకులాల్లోకి విద్యార్థులు తొలి రోజునే హాజరయ్యారు. గత సంవత్సరం 4,200ల విద్యార్లు సంఖ్య ఉంటే ఈ సారి దానిని 5 వేలకు పెంచారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...