గురుకుల పాఠశాలల్లో చేర్పించాలి


Wed,June 12, 2019 12:50 AM

బాసర : నూతన విద్యా సంవత్సరం 2019-20కుగాను గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను బుధవారం చేర్పించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమలత ఒక ప్రకటనలో తెలిపారు. 13వ తేదీ తర్వాత వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు నిర్మల్ ఆర్సీవో కార్యాలయానికి వెళ్లి ప్రవేశానికి అనుమతి తీసుకోవాలన్నారు. వారం రోజుల కంటే ఎక్కువ ఆలస్యం చేసిన వారు సెక్రెటరీ వద్దకు వెళ్లి అనుమతి పొందాల్సి ఉంటుందని సూచించారు. ఎ లాంటి కారణం లేకుండా పది రోజుల తర్వాత వచ్చే వారి అడ్మిషన్ రద్దు చేస్తామని, ఆ స్థానంలో బ్యాక్‌లాగ్ సీట్ల కోసం పరీక్ష రాసిన వారితో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...