అమరవీరులకు నివాళి


Wed,June 12, 2019 12:50 AM

ఇంద్రవెల్లి : ఉత్తరఖాండ్‌లోని గంగోత్రి, నందావన్ మౌంటేన్ భగీరథ-2 హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన మడ వి కన్నిబాయి, మడవి కల్పన అమరవీరులకు నివాళులర్పించి శ్రద్ధంజలి ఘటించారు. మంగళవారం మండలంలోని హిరాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అమరవీరుల స్తూపంవద్ద ఫూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గంగోత్రి, నందవన్ పర్వతాలు 6వేల 512 మీటర్లను అధిరోహించామని పేర్కొన్నారు. మే 6న బయలుదేరి జూన్ 2న చేరుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పర్వతాలపైనే నిర్వహించినట్లు తెలిపారు. పర్వతంలో భాగంగా 5వ స్థలం వద్ద ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పటికీ లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగిపోయామన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఆదివాసి గిరిజన మహిళలు ఎత్తైన కొండ పర్వతాలను అధిరోహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.కార్యక్రమం లో శిక్షణ కోఆర్డినేటర్ కే రంగారావ్, తోటి మహిళ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు పెందూర్ తిరుమల, జిల్లా అధ్యక్షుడు ఆనం ద్, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మడవి రజినికాంత్, నా యకులు సితారాం, శంకర్, కార్తీక్, ప్రవీణ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...