కన్న కొడుకులే కాదంటున్నారు!


Wed,June 12, 2019 12:50 AM

బోథ్, నమస్తే తెలంగాణ : కన్న కొడుకులే కాదంటున్నారు.. ఉన్న భూమిని ఇల్ల్లును తీసుకుని అనాథలుగా వదిలేశారు.. తిండికి ఆ వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మునిగెల చిన్నారెడ్డి-లింగవ్వ ధీనగాథ ఇది! ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్గుట్ట గ్రామానికి చెందిన మునిగెల చిన్నారెడ్డి-లింగవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. మునిగెల నర్సయ్య, మునిగెల శ్రీనివాస్. తమకు ఉన్న ఆరు ఎకరాల భూమి, ఇల్లు లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు. ఇద్దరు కన్న కొడుకులే వారిని అనాథలుగా వదిలేయడంతో ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. ముసలితనంలో నిలువ నీడలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ పండుటాకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు ఆర్డీవో సూర్యనారాయణను మంగళవారం కోరారు. స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో వృద్ధ దంపతులకు హామీ ఇచ్చారు. వార్ధాక్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నవారిపై చర్యలు తప్పవని ఆర్డీవో ఈ సందర్భంగా హెచ్చరించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...