పశువులకు టీకాలు వేయించాలి


Wed,June 12, 2019 12:50 AM

సోన్: పశువులకు వర్షాకాలంలో వచ్చే గొంతువాపు వ్యాధికి సంబంధించిన నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రమేశ్ కుమార్ సూచించారు. నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామంలో మంగళవారం పశువులకు టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులు, పశుపోషకులతో మాట్లా డి వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎద్దులు, ఆవులు, బర్రెలకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధు లు వస్తాయని, మేకలు, గొర్రెలకు చిటుకు వ్యాధి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. పశువులకు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. గ్రామంలో సుమారు 650 జీవాలకు టీకాలు వేసిట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పుల గంగయ్య, డాక్టర్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...