ఉన్నతస్థాయికి ఎదగాలి


Wed,June 12, 2019 12:49 AM

ఎదులాపురం : విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ సాంఘిక సంక్షేమ సముదాయ ఆవరణలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల లక్కీడ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్నుద్దేశించి జేసీ మాట్లాడారు. ప్రభుత్వం దళిత విద్యార్థుల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు కల్పించిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేద కుటుంబంలో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదివించలేని, ఆర్థిక స్థోమత లేని వారికి బెస్ట్ అవలెబుల్ స్కూల్ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) డీఈవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ఉన్నాయన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో డే స్కాలర్ శ్రీరాంరెడ్డి, ప్రగతి హైస్కూల్, కృష్ణవేణి స్కూల్, ఉట్నూర్‌లో రెసిడెన్షియల్ పాఠశాలలు, పూలాజీబాబా, సెయింట్ పాల్స్, సరస్వతీ జ్ఞాన విద్యామందిర్ ఉన్నాయన్నారు. 1వ తరగతిలో 11 సీట్లకు గాను 36 మంది బాలురు దరఖాస్తు చేసుకున్నారు. 6 సీట్లు బాలికలకు కేటాయించగా.. 48 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 5వ తరగతి రెసిడెన్షియల్ పాఠశాల కోసం 11 సీట్ల కోసం 80 మంది బాలురు దరఖాస్తు చేసుకున్నారు. బాలికలకు కేటాయించిన 6 సీట్లకు 42 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. కేటాయించిన సీట్లకు అదనంగా వెయిటింగ్ లిస్టును విద్యార్థులను ఎంపిక చేసి ఉంచామన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లక్కీడ్రాలో ఎంపికైన విద్యార్థులు తమ నిజ ధ్రువీకరణ పత్రాలు ఈ నెల 17వ తేదీ వరకు జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ కార్యాలయానికి తీసుకురావాలన్నారు. వచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పరిశీలించి అలాట్‌మెంట్ కాపీలను అందిస్తామని జేసీ చెప్పారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...