14 నుంచి ధ్రువపత్రాల పరిశీలన


Wed,June 12, 2019 12:49 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పోలీసు ఉద్యోగం కోసం తుది పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నిజదృవపత్రాల పరిశీలన ఈనెల 14నుంచి కొనసాగుతుందని ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహిస్తామని తెలిపారు. 14 నుంచి 22వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4962 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగు తుందన్నారు. పోలీసు శాఖలో అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి పరిశీలన ఏర్పాటు చేశామన్నారు. పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటిమేషన్ లెటర్లను మండలి వెబ్‌సైట్‌లో ఈనెల 12నుంచి 13వ తేదీ 8గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా వాటిని పొందవచ్చన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన రోజు మాత్రమే ఉదయం 9గంటలకు ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్‌లో హాజరుకావాలని సూచించారు. ఇంటిమేషన్ లెటర్ చూపించిన వారికి మాత్రమే లోనికి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత, కులం, పుట్టిన తేదీ వంటి అన్ని రకాల అసలు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ అవుట్, ఆధార్ కార్డు అభ్యర్థుల వెంట తీసుకరావాలని సూచించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...