నర్సరీని పరిశీలించిన డీపీవో


Wed,June 12, 2019 12:49 AM

సోన్: నిర్మల్ మండలం రత్నాపూర్‌కాండ్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఏపుగా పెరిగిన మొక్కలను పక్కన పెట్టించాలని, లేకపోతే వేర్లు భూమిలోకి వెళ్తాయన్నారు. మొక్కల సంరక్షణలో జాగ్రతలు పాటించాలన్నారు. గ్రామాల్లో ఇంటి కొలతలు సేకరించి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. డీపీవో వెంట సర్పంచ్ లావణ్య శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్, ఉప సర్పంచ్ జి.హరీశ్ తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...