ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీ


Wed,June 12, 2019 12:49 AM

ఇచ్చోడ : మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలను చేపట్టారు. సహార అగ్రో ఏజెన్సీస్, వాసవీ ట్రేడర్స్, నేహా ట్రేడర్స్, సాయి కృపా ఫర్టిలైజర్స్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, క్రిమి సంహారక మందులను రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అమృత్‌రెడ్డి మాట్లాడారు. ఇచ్చోడలోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో స్టాక్ లేబుల్లు, బిల్లులు, క్యాష్ మెమో, స్టాక్ బోర్డులు, ధరల పట్టిక వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. సాయి కృపా ఫర్టిలైజర్స్ దుకాణంలో స్టాక్ పరిధికి మించి ఎక్కువగా ఉన్నదన్నారు. యూరియా, డీఏపీ, 22-20-0-13, సూపర్, పొటాష్ వంటి ఎరువులకు సంబంధించిన స్టాక్ లేబులు బిల్లులకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. సుమారు రూ. 2 లక్షలపైనే స్టాక్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సదరు వ్యాపారిపై 6 (ఏ) కింద కేసు నమోదు చేశామన్నారు. అధికంగా ఉన్న ఎరువులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయడానికి వచ్చే రైతన్నలకు కచ్చితంగా రశీదులను ఇవ్వాలనీ ఆయన వ్యాపారులకు సూచిం చారు. రసీదులను ఇవ్వని, నాసి రకం విత్తనాలను విక్రయించే వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం స్టేట్ అధికారి శివ ప్రసాద్, ఏవో కైలాస్ జాదవ్, ఏఈవో ఉదయ్ కిరణ్, సిబ్బంది ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...