సీజనల్ వ్యాధులపై అవగాహన


Wed,June 12, 2019 12:48 AM

ఇచ్చోడ : వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై మంగళవారం దుబార్‌పేట్ గ్రామంలో ప్రభుత్వ వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి సాగర్ మాట్లాడారు. వర్షాకాలంలో డయేరియా, అతిసార, మలేరియా, తదితర వ్యాధులు గ్రామాల్లో ప్రబలితే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, భోజనం చేసేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు తీసుకునే చర్యలు, గిరిజనులకు ఆయన క్లుప్తంగా అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫర్‌థింగ్ (ఐడీసీఎఫ్) అవగాహన కార్యక్రమాలను జూన్ 22 వరకు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుధ, పద్మ, భీంబాయి, ఉషబాయి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...