దొంగిలించిన ద్విచక్రవాహనాలు స్వాధీనం


Wed,June 12, 2019 12:48 AM

తానూర్ : మండల కేంద్రంతో పాటు కోలూర్, బోల్సా గ్రామాల్లో దొంగతనానికి గురై అమ్మిన 10 ద్విచక్ర వాహనాలను సోమవారం రాత్రి నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భైంసా పట్టణానికి చెందిన హైమద్ నిజామాబాద్ 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంత కాలంగా ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్నాడు. ఇటీవల అక్కడి పోలీసులు హైమద్‌ను పట్టుకున్నారు. పోలీసులు ఆయనను విచారించగా.. తానూర్ మండలంలో 10 ద్విచక్రవాహనాలను అమ్మినట్లు ఒప్పుకున్నాడు. దీని ఆధారంగా నిజామాబాద్ పోలీసులు తానూర్ మండలంలో 10 ద్విచక్రవాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నిజామాబాద్ పోలీసులు తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...