దృష్టి మరల్చి రూ. 50 వేలు చోరీ


Wed,June 12, 2019 12:48 AM

కుంటాల : మండలంలోని కల్లూర్ గ్రామంలో మంగళవారం చోరీ జరిగింది. కుంటాల ఎస్సై సునిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కల్లూర్‌లోని శ్రీకృష్ణ ఎలక్ట్రికల్ షాపునకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ఎలక్ట్రికల్ వస్తువులు కావాలని చెప్పి యజమాని దృష్టి మరల్చి కౌంటర్‌లో ఉన్న రూ. 50 వేల నగదును అపహరించారు. యజమాని పక్కనే ఉన్న ర్యాకు నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకొచ్చే లోపే నిందితుడు దుకాణం నుంచి పరారయ్యారు. కౌంటర్ తెరిచి చూడగా.. అందులో ఉన్న నగదు లేకపోవడంతో హైరానాపడ్డ యజమాని కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునిల్‌కుమార్ తెలిపారు. దుకాణంలో చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...