పాఠశాలకు నూతన భవనం నిర్మించాలి


Sat,May 25, 2019 11:51 PM

దస్తురాబాద్: మండలంలోని ఉమ్మడి మున్యాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు తేలి, శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉందని, నూతన భవనం నిర్మించాలని మున్యాల తండా సర్పంచ్ నాగవత్ సురేశ్ నాయక్ అన్నారు. శనివారం ఆయన పాఠశాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని, భవనం పైకప్పులు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉందని అన్నారు. భవనం శిథిలావస్థలో ఉండడంతో పాటు, పాఠశాలలో సరిపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత వర్షాకాలంలో పిల్లలపై మట్టి దిబ్బలు కూలాయని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనంతో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...