అగ్నిప్రమాదంలో పైపులైన్లు దగ్ధం


Sat,May 25, 2019 11:50 PM

ఖానాపూర్ : మండలంలో శనివారం రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వివరాలను పరిశీలిస్తే ఖానాపూర్ - తర్లాపాడు గ్రామాల మధ్య వ్యవసాయ భూముల్లో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. సమీపంలోనే ఇండియన్ గ్యాస్ గోదాము ఉండటంతో గోదాములో పనిచేసే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్ చేరువలోనే ఉండడంతో మంటలు గ్యాస్ గోదాముకు వ్యాపించలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పినైట్లెంది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు మొడికె మల్లేశ్, మల్లయ్య, బత్తుల లక్ష్మి, కాలేరి గంగారెడ్డి సంబంధించిన పశుగ్రాసం, పంపుసెట్లు, పైప్‌లైన్లు మంటల్లో తగలబడిపోయాయి. ప్రమాదం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే పొలాన్ని కోసి పశుగ్రాసాన్ని పొలంలోనే ఉంచామని, ఇంటికి తరలించుకొని పోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి నష్టపోయామని రైతులు అన్నారు. ప్రభుత్వం కాలిపోయిన పంపుసెట్లు, పశుగ్రాసానికి నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...